Friday, April 19, 2013

అయిదు రూపాయలకే అపరిమితంగా మాట్లాడుకోండి...!!! Unlimited Talk @ Just Rs 5...!!!

             
                     రూ 5 కి లభించే వస్తువుల జాబితాలో తాజాగా టారిఫ్ వోచర్ కూడా చేరిపోయింది. టెలికాం రంగంలో సంచలనానికి తెర లేపుతూ యునీనార్ రూ 5 విలువగల టారిఫ్ వోచర్ ని ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో నిన్న ప్రవేశ పెట్టింది. ఒక రోజు కాల పరిమితి కలిగిన ఈ వోచర్ ద్వారా యునినార్ నుంచి యునినార్ కు అపరిమిత లోకల్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే యునినార్ నుంచి యునినార్ కి 50 SMS లను కూడా ఉచితంగా పంపుకోవచ్చు. పేపర్ రీఛార్జి ( కార్డు) రూపంలో ఈ వోచర్లు లభిస్తాయి. దీంతో వినియోగదారులు తమకు అవసరమయినప్పుడు వీటిని వినియోగించుకోవచ్చని యునినార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కన్నన్ ఈ సందర్భంగా తెలిపారు. 
                   రూ 5 విలువగల ప్యాక్ లు ఇతర కంపెనీల నెట్ వర్క్స్ లో ఉన్నప్పటికీ అవి పేపర్ వోచర్ ద్వారా మాత్రం అందుబాటులో లేవు. వాటిని కేవలం USSD ద్వారా మాత్రమే ఆక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ యునినార్ పేపర్ రీఛార్జి రూపంలో ఈ వోచర్ లను ప్రవేశ పెట్టి సరికొత్త సంచలనానికి తెరలేపింది. 
Source: Sakshi Daily 


గమనిక : దయచేసి రీఛార్జి  చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .

No comments:

Post a Comment