రిలయన్స్ తాజాగా తన CDMA విభాగంలో అత్యంత ఆదరణ పొందిన 94 రూపాయల డేటా ప్యాక్ కి సవరణలు చేసింది . ఇప్పటివరకు ఈ డేటా ప్యాక్ కింద ప్రతి నెలా 1 GB హై స్పీడ్ డేటాని ఆరు నెలలతో పాటు ప్రతి రోజూ 100 మెసేజ్ లను ఆరు నెలల పాటు ఉచితంగా పంపుకునే వెసులుబాటు ఉండేది. అయితే టెలికాం రంగంలోని ఇతర ఆపరేటర్లు ఇన్ కమింగ్ మెసేజ్ లకు టెర్మినేషన్ ఛార్జ్ లు వసూలు చేయడం మొదలు పెట్టడంతో రిలయన్స్ తన డేటా ప్యాక్ లోని ఉచిత sms లను ఉపసంహరించుకుంది. అదే విధంగా వాలిడిటిని కూడా ఒక నెలకు తగ్గించింది.
ఈ మార్పులు ఇంకా ఆ సంస్థ వెబ్ సైట్లో అప్ డేట్ చేయలేదు. అయితే అదే సంస్థకు చెందిన ఆన్లైన్ రీఛార్జి పోర్టల్లో ఈ మార్పులను గమనించవచ్చు.
కొత్త డేటా ప్యాక్ ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. Rs 5 offers 60 MB for 1 day
2. Rs 18 offers 200 MB for 3 days
3. Rs 44 offers 500 MB for 10 days
4. Rs 94 offers 1.5 GB for 30 days
గమనిక : దయచేసి రీఛార్జి చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .
No comments:
Post a Comment