రిలయన్స్ తన GSM వినియోగదారుల కోసం ఒక కొత్త ఆఫర్ని ప్రవేశ పెట్టింది. రిలయన్స్ ట్విట్టర్ ఆక్సెస్ ప్యాక్ ( Reliance Twitter Access Pack) గా పిలవబడే ఈ ప్యాక్ ని ట్విట్టర్ ఇండియా వారి భాగస్వామ్యంతో తన ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టి ఉచితంగా ట్విట్టర్ ని ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. ఈ ప్యాక్ తన కొత్త మరియు పాత కస్టమర్లు ఇద్దరూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆక్టివేట్ చేసుకున్న రోజు నుండి 90 రోజుల పాటు ఈ ప్యాక్ ద్వారా కేవలం ట్విట్టర్ ని మాత్రమే ఉచితంగా బ్రౌస్ చేసుకోవచ్చు.
ఈ ఆఫర్ని పొందడానికి వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్స్ నుంచి “ACT Twitter” అని టైపు చేసి 53739 అను నెంబరుకి మెసేజ్ పంపడం ద్వారా కాని, లేదా *777*30# కి డయల్ చేయడం ద్వారా కాని ట్విట్టర్ని అపరిమితంగా 90 రోజుల పాటు ఆనందించవచ్చు.
No comments:
Post a Comment