Monday, April 8, 2013

ప్రీ పెయిడ్ బేస్ టారిఫ్ రేట్లను భారీగా పెంచిన టాటా డో కో మో... సెకనుకి 2 పైసల దాకా వడ్డన....!!! Tata Docomo increases prepaid base tariff up to 2 paisa per second...!!!

                 

                    టెలికాం  రంగంలో  ప్రతి సెకనుకి ఒక పైసా నినాదంతో అదిరిపోయే ఆరంగేట్రం చేసిన టాటా డో కో మో తన పంధా మార్చుకుంది. ఈ మధ్యనే డేటా, మెసేజ్ మరియు వాయిస్ ప్యాక్ ల ధరలు పెంచిన డొ కో మో తాజాగా తన బేస్ టారిఫ్ రేట్లను దాదాపు 100% మేర పెంచి ఇతర ఆపరేటర్లతో జత కలిసింది. పెంచిన రేట్ల  ప్రకారం తన బేస్ టారిఫ్ ధరను ప్రతి సెకనుకి 2 పైసల చొప్పున నిర్ణయించింది ( బేస్ టారిఫ్ అంటే ఎటువంటి స్పెషల్ టారిఫ్ ప్యాక్ లు లేకుండా కంపెనీ ఛార్జ్ చేసే ధర.) ఈ టారిఫ్ అన్ని లోకల్ మరియు  ఎస్ టి డి మొబైల్స్ కి వర్తిస్తుంది. ఈ బేస్ టారిఫ్ ప్యాక్ లు  కేవలం కొత్తగా కనెక్షన్లు తీసుకునే వారికి ఒక సంవత్సర వాలిడిటితో వర్తిస్తాయని, పెంచిన టారిఫ్ లు తన CDMA  మరియు GSM కస్టమర్లకు ఇద్దరికీ వర్తిస్తాయని,పాత కస్టమర్లకు వారి వారి బేస్ టారిఫ్ చొప్పునే ఛార్జ్ చేయ బడుతుందని ఆ కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటన లో తెలిపింది. 

No comments:

Post a Comment