Monday, April 15, 2013

అమెరికా వెళ్ళే వారి కోసం ఎయిర్ టెల్ నుంచి ప్రత్యేక అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ లు... Airtel Introduces Special International Roaming Packs...!!!

               
            ఈ మధ్యనే జాతీయ రోమింగ్ ప్యాక్ ని ప్రవేశ పెట్టిన (National Roaming Pack)ఆంధ్రప్రదేశ్ అతి పెద్ద  టెలికాం నెట్ వర్క్ ఎయిర్ టెల్, విదేశాలకు వెళ్ళే తన వినియోగదారుల కోసం ప్రత్యేక అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ లను ప్రవేశ పెట్టింది. అమెరికాలో పర్యటించే వినియోగదారులు 8500 రూపాయల రెంటల్ ఉండే ప్యాక్ లో 5 గంటల పాటు ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ ని పొందవచ్చని తెలిపింది. ఇక అవుట్ గోయింగ్ కాల్స్ విషయానికి వస్తే నిమిషానికి 20 రూపాయల చొప్పున అవుతుందని వివరించింది. ఈ ఆఫర్ 30 రోజులపాటు చెల్లుబాటు అవుతుందని, ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ అయిపోయిన తర్వాత ఇన్ కమింగ్ కాల్ కి నిమిషానికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తామని వివరించింది. అలాగే 3500 రూపాయల ప్యాక్ కు 60 నిమిషాలు, 1000 రూపాయల ప్యాక్ కు 10 నిమిషాల ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ ని పొందవచ్చని పేర్కొంది. 
               ఒక్క అమెరికాకే కాకుండా సింగపూర్, మలేషియా, థాయ్ ల్యాండ్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, ఆస్ట్రేలియా , జర్మనీ , యూ ఎ ఇ, ఇంగ్లాండ్ దేశాలకు కూడా ప్రత్యేక అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ లను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. 

No comments:

Post a Comment