Saturday, April 13, 2013

కొత్తగా 3G కనెక్షన్లు ఇవ్వవద్దు... టెలికాం కంపెనీ లకు సుప్రీం ఆదేశాలు... మన రాష్ట్రం లో వోడఫోన్ పై పడనున్న ప్రభావం...!!!

                    
                   లైసెన్సులు పొందకుండా తమ మధ్య కుదుర్చుకున్న అంతర్గత ఒప్పందం ద్వారా అక్రమంగా 3G సర్విస్ లు అందజేస్తున్న అంశంపై  టెలికాం కంపెనీలు  (ఐడియా,ఎయిర్ టెల్, వోడాఫోన్)  మరియు ట్రాయ్ మధ్య జరుగుతున్న వివాదం సుప్రీం కోర్టుకి చేరింది. దీనిపై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ 3G లైసెన్సులు లేని టెలికాం కంపెనీలు తదుపరి తీర్పు వచ్చేంత వరకూ  ఆయా  సర్కిళ్లలో కొత్తగా 3G కనెక్షన్లు ఇవ్వరాదని పేర్కొంది. అయితే ప్రస్తుతం 3G సేవలు పొందుతున్న వినియోగదారులకు తమ సేవలను అందించవచ్చని తెలిపింది. తదుపరి విచారణను మే నెలకు వాయిదా వేసింది. 
మన రాష్ట్రం పై సుప్రీం తీర్పు ప్రభావం:
                  మన రాష్ట్రం లో ఎయిర్ టెల్, ఐడియా, BSNL, ఎయిర్ సెల్ కంపెనీలు 3G లైసెన్స్ ను కలిగి ఉన్నాయి. అయితే వోడఫోన్ కి మన రాష్ట్రం లో 3G లైసెన్స్ లేకపోయినా కూడా ఐడియా తో కుదుర్చుకున్న అంతర్గత ఒప్పందం ద్వారా  తన వినియోగ దారులకు 3G సేవలను అందిస్తుంది. దీంతో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం మన రాష్ట్రం లో వోడాఫోన్ కంపెనీ మీద పడనుంది. కనుక ఆ కంపెనీ కొత్తగా 3G కనెక్షన్లను గానీ, డేటా కార్డులు కానీ అమ్మకూడదు.

No comments:

Post a Comment