Tuesday, April 30, 2013

అందుబాటులోకి వచ్చిన BSNL కొత్త 3G డేటా వోచర్లు.

        

                         ఈ  నెల మొదట్లో BSNL కొత్తగా మూడు డేటా ప్లాన్లను ప్రవేశ పెట్టిన విషయం AP Telecom News పాఠకులకు విదితమే. Clik here To know Full details of  BSNL New 3G data plans . అయితే ఏప్రిల్ 15 నుంచి అందుబాటులోకి రావలసిన ఈ ప్లాన్లు ఈ రోజు అనగా 30 ఏప్రిల్ 2013 నుంచి మన రాష్ట్రం లో అందుబాటులోకి వస్తాయని BSNL విడుదల చేసిన ఒక ప్రకటన లో తెలిపింది. అన్ని వోచర్లు ఒక సంవత్సర కాలపరిమితి తో లభిస్తాయి. 
Full Details Of New BSNL 3G Data Plans



Sunday, April 28, 2013

ఎయిర్ టెల్ ఫుల్ టాక్ టైం ఆఫర్....!!! Airtel Full talk time offer...!!!

                
                        ఎయిర్టెల్ 80 మరియు 150 రూపాయల మీద ఫుల్ టాక్ టైం ని అందిస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్క రోజు (28th ఏప్రిల్ 2013)మాత్రమే. మీరు కాల్ చేసిన తర్వాత మీ స్క్రీన్ మీద వచ్చే మెసేజ్ లో ఈ సమాచారం ఉంది.  అలాగే ఎయిర్టెల్ మనీ తో రీఛార్జి చేసుకుంటే 100 రూపాయలకు 110 మరియు 200 రూపాయలకు 220 టాక్ టైం లభిస్తుంది. 

గమనిక : దయచేసి రీఛార్జి  చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .


Saturday, April 27, 2013

వోడాఫోన్ గెలాక్సీ S4 ఆఫర్... !!! Vodafone India Launches ‘ALL-IN-ONE’ Plan for Samsung Galaxy S4...!!!

                      శాంసంగ్ నిన్న ఆవిష్కరించిన గెలాక్సీ S4 ని కొనుగోలు చేయదలచిన కస్టమర్ల కోసం వోడాఫోన్ ప్రత్యేకంగా ఆల్-ఇన్-వన్ టారిఫ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రకారం వాయిస్, డేటా, అలాగే SMS ప్రయోజనాలు తమ పోస్ట్ పెయిడ్ మరియు ప్రీ పెయిడ్ వినియోగదారులు ఇరువురికీ అందుబాటులో ఉంటాయి. అలాగే తమ స్టోర్ లో S 4 కొన్నవారు పోటీ ద్వారా IPL టికెట్లు , శాంసంగ్ ఫోన్లు బహుమతిగా పొందే అవకాశాన్ని సైతం కల్పిస్తున్నట్లు వోడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది. 

For Post Paid Users:
  •  For a single rental of Rs 1199, post-paid customers will get Unlimited Internet (3GB FUP after that speed will be reduced to 64kbps), 3000 local and STD voice minutes and 750 local and national SMS. They will also get Missed Call Intimation service free for one year with this plan. 
For Pre Paid Users: 
  •  Recharge of Rs 678 with validity of 30 days offers Unlimited Internet (1GB FUP  after that speed will be reduced to 64kbps), 1000 local and STD voice minutes and 500 local and national SMS.
  •  Recharge of Rs 345 with validity of 15 days offers Unlimited Internet (512MB FUP after that speed will be reduced to 64kbps), 500 local and STD voice minutes and 250 local and national SMS.
గమనిక : దయచేసి రీఛార్జి  చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .
Source: Sakshi Daily

Friday, April 26, 2013

ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న మొబైల్ వినియోగదారుల సంఖ్య (మార్చ్ 2013 నాటికి)...అత్యధికంగా వినియోగదారులను చేర్చుకున్న రిలయన్స్... కస్టమర్లను కోల్పోయిన టాటా డొ కో మొ...!!!

      ఆంధ్రప్రదేశ్ తాజా మొబైల్ వినియోగదారుల సంఖ్య (మార్చ్ 2013 నాటికి) ఈ క్రింది విధంగా ఉంది. 



Airtel                        1,82,51,864     (+1,78,026)

Idea                           1,11,93,280     (+1,65,174)

3 BSNL                          90,92,617      (0)*
*****

Reliance                     71,09,338      
(+2,17,657)

Tata Docomo             67,56,030        (-21749)


Vodafone                    58,65,618       (+86,800)

Uninor                        43,04,686       (+1,15,646)

Aircel                          17,62,191       (+24,663)

MTS                            Closed Its Operations In AP Circle



Source: March-13 data released by AUSPI and COAI

NOTE: 

  • Reliance and Tata Docomo numbers indicate both CDMA  and GSM subscribers. 
  • *****BSNL has not updated data for March month. The numbers are  as on Feb 2013
  • Figures in brackets indicate change in subscribers over previous month

Thursday, April 25, 2013

వోడాఫోన్ వినియోగదారులకు శుభవార్త. మీ కోసం సరికొత్త రోమింగ్ ప్యాక్... రోమింగ్ లో కేవలం 30 పైసలకే ఇన్ కమింగ్ కాల్...!!! Vodafone Introduces New National Roaming Pack for Pre Paid Subscribers In Andhra Pradesh...!!!

            గత వారంలో ఎయిర్టెల్ ప్రవేశ పెట్టిన రోమింగ్ ప్యాక్ కి ( Airtel National Roaming Pack)ఇంచు మించు ఒకే విధంగా ఉండేలా వోడాఫోన్ కూడా జాతీయ రోమింగ్ ప్యాక్ ని ప్రవేశ పెట్టింది. మన రాష్ట్రం లో ఈ ప్యాక్ ధరని 36 రూపాయలుగా నిర్ణయించింది. ఇతర వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

MRP (Rs) 36.0
Recharge/Bonus card Plan Voucher
Talktime (Rs) 0  
(Equivalent mins)
Benefit Roaming Incoming @ 30 P/Min for 30 days and 1.5 P /Sec for the remaining 150 days. Home Rates : Outgoing @ 1.5 P/sec for 180 days ( Home + Roam ). Standard rates for ISD and SMS . Applicable only for national roaming on vodafone Network.
Validity (Days) 180 Days
Access Fee (Rs) 30.86
Service Tax (%) 12.36

Wednesday, April 24, 2013

90 రోజుల పాటు Twitter ని ఉచితంగా ఆనందించండి....!!! రిలయన్స్ GSM వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్....!!! Reliance Introduces Twitter Access Pack for prepaid GSM subscribers

                       
                           
               రిలయన్స్ తన GSM వినియోగదారుల కోసం ఒక కొత్త ఆఫర్ని ప్రవేశ పెట్టింది. రిలయన్స్ ట్విట్టర్ ఆక్సెస్ ప్యాక్ ( Reliance Twitter Access Pack) గా పిలవబడే ఈ ప్యాక్  ని ట్విట్టర్ ఇండియా వారి భాగస్వామ్యంతో తన ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టి ఉచితంగా ట్విట్టర్ ని ఉపయోగించుకునే అవకాశం  కల్పించింది. ఈ ప్యాక్ తన కొత్త మరియు పాత కస్టమర్లు ఇద్దరూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆక్టివేట్ చేసుకున్న రోజు నుండి 90 రోజుల పాటు ఈ ప్యాక్ ద్వారా కేవలం ట్విట్టర్ ని మాత్రమే ఉచితంగా బ్రౌస్ చేసుకోవచ్చు. 
                  ఈ ఆఫర్ని పొందడానికి వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్స్ నుంచి “ACT Twitter” అని టైపు చేసి 53739 అను నెంబరుకి మెసేజ్ పంపడం ద్వారా కాని, లేదా *777*30#  కి డయల్ చేయడం ద్వారా కాని ట్విట్టర్ని అపరిమితంగా 90 రోజుల పాటు ఆనందించవచ్చు. 

Tuesday, April 23, 2013

సేవ ఇంత కష్టమా ...!!! మొబైల్ కంపెనీల స్థితిగతులపై ఈనాడు లో వార్త... AP Telecom News అభిమానుల కోసం....!!!


పూర్తి వార్త చదవడానికి బొమ్మ మీద నొక్కండి లేదా ఈ క్రింది లింకు నొక్కండి...
Click Here

అత్యంత ప్రజాదరణ పొందిన 35 రూపాయల STV కి సవరణలు చేసిన రిలయన్స్ .....!!!

                రిలయన్స్ తన CDMA విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన 35 రూపాయల STV కి సవరణలు చేసింది. గతంలో 90 రోజులు ఉండే ఈ ప్యాక్  కాలపరిమితిని 60  రోజులకు కుదించింది. అంతే కాకుండా  రిలయన్స్ నుంచి రిలయన్స్ కాల్స్ ని నిమిషానికి 5 పైసల నుంచి  10 పైసలకు మరియు STD కాల్స్ ని నిమిషానికి 60 పైసల నుంచి 75 పైసలకు పెంచింది. అయితే నిమిషానికి 30 పైసలుగా ఉన్న లోకల్ కాల్ టారిఫ్ కి మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు. టెలికాం ఇండస్ట్రీ లో ప్రస్తుతానికి ఇదే అత్యుత్తమ రేట్ కట్టర్ కావడం గమనార్హం.

సవరణలు చేసిన తరువాత ఈ ప్యాక్ వివరాలు  ఈ క్రింది విధంగా ఉన్నాయి. 
  • Local On Net- @ 10p/min
  • Local Off Net- @ 30p/min
  • STD and other Landline @ 75p/min
  • 50 MB data free for 1st month 
  • Validity- 60 Days

Monday, April 22, 2013

రూ 38, రూ 39 STV ప్యాక్ ల మీద కాల పరిమితిని 60 రోజులకు పెంచిన ఐడియా....Validity Doubled On RC38,RC39 Packs in IDEA...!!!

                 

                 ఐడియా తన రూ 38, రూ 39 STV ప్యాక్ ల మీద కాల పరిమితిని రెట్టింపు చేసింది. ఇప్పటి వరకూ 30 రోజులు ఉన్న కాలపరిమితిని 60 రోజులకు పెంచింది. ప్యాక్ ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 
  • RC 38= Local idea to idea calls @ 10paisa/minute & Idea to Other Local&STD mobiles @ 1paisa/sec. Valid for 60 days. First two I 2 I mins of the day will be charged @ 1.5p/sec
  •  
  • RC 39= All local calls @ 1.2 paisa/2sec & All STD calls @ 1.4 paisa/2sec. Valid for 60 days.1st local & 1st STD min of the day @ 2p/sec.

Friday, April 19, 2013

అయిదు రూపాయలకే అపరిమితంగా మాట్లాడుకోండి...!!! Unlimited Talk @ Just Rs 5...!!!

             
                     రూ 5 కి లభించే వస్తువుల జాబితాలో తాజాగా టారిఫ్ వోచర్ కూడా చేరిపోయింది. టెలికాం రంగంలో సంచలనానికి తెర లేపుతూ యునీనార్ రూ 5 విలువగల టారిఫ్ వోచర్ ని ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో నిన్న ప్రవేశ పెట్టింది. ఒక రోజు కాల పరిమితి కలిగిన ఈ వోచర్ ద్వారా యునినార్ నుంచి యునినార్ కు అపరిమిత లోకల్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే యునినార్ నుంచి యునినార్ కి 50 SMS లను కూడా ఉచితంగా పంపుకోవచ్చు. పేపర్ రీఛార్జి ( కార్డు) రూపంలో ఈ వోచర్లు లభిస్తాయి. దీంతో వినియోగదారులు తమకు అవసరమయినప్పుడు వీటిని వినియోగించుకోవచ్చని యునినార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కన్నన్ ఈ సందర్భంగా తెలిపారు. 
                   రూ 5 విలువగల ప్యాక్ లు ఇతర కంపెనీల నెట్ వర్క్స్ లో ఉన్నప్పటికీ అవి పేపర్ వోచర్ ద్వారా మాత్రం అందుబాటులో లేవు. వాటిని కేవలం USSD ద్వారా మాత్రమే ఆక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ యునినార్ పేపర్ రీఛార్జి రూపంలో ఈ వోచర్ లను ప్రవేశ పెట్టి సరికొత్త సంచలనానికి తెరలేపింది. 
Source: Sakshi Daily 


గమనిక : దయచేసి రీఛార్జి  చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .

Thursday, April 18, 2013

మీ మొబైల్ లో మిగిలి ఉన్న ఇంటర్నెట్ బాలన్స్ ఇలా తెలుసుకోండి !!! How To Check Internet/GPRS Balance in Your Mobile Through USSD Codes...???

How To Check Internet/GPRS Balance in Your Mobile Through USSD Codes...??? ( Only for GSM )

  • Airtel ----------------*123*10#
  • BSNL---------------- *234#
  • Idea-------------------*125#
  • Tata Docomo GSM----------- *111*1#
  • Reliance GSM---------------- *367*3#
  • Vodafone----------------------- *111#
Request : ప్రియమయిన బ్లాగర్లకు విజ్ఞప్తి... మీకు  కనుక యునినార్ లేదా  ఎయిర్ సెల్ USSD కోడ్లు తెలిస్తే దయచేసి కామెంట్ పెట్టగలరు. ధన్యవాదములు. 

Tuesday, April 16, 2013

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వోడాఫోన్ నుంచి "మై వోడాఫోన్ " అప్లికేషను.... Vodafone Launches ‘My Vodafone’ App For Android...!!!

              తన ప్రీ పెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం వోడాఫోన్ "మై వోడాఫోన్ " అనే  పేరుతో కొత్త అప్లికేషను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ అప్లికేషను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడే వినియోగదారులను మాత్రమే ఉద్దేశించి విడుదల చేసినది కావడం గమనార్హం. ఈ అప్లికేషను ఎయిర్ టెల్ వారి మై ఎయిర్టెల్ ఆప్ ని పోలి ఉంటుంది. 

ఈ అప్లికేషను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా... ?
           స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ మొబైల్ లో గల గూగుల్ ప్లే స్టోర్ ( Google Play Store) కి వెళ్లి ఉచితం  గా డౌన్లోడ్ చేసుకోనవచ్చు. 

ఈ అప్లికేషను ఉపయోగాలు: ( వోడాఫోన్  సైట్ నుంచి తీసుకొనబడినవి)
For Prepaid Customers :

  • View and subscribe to Best Offers.
  • Check their main and bonus balances
  • Recharge account with Credit Card
  • View recent recharges and deductions
  • View current data plan details and data usage.
  • Manage activation / deactivation of your Value Added Services
  • Track status of recent service requests / complaints
For Postpaid Customers :
  • View your current bill details, charges, un-billed amount, credit limit etc.
  • Pay bills with Credit Card
  • View recent payments made
  • View/Change Bill preferences.
  • View current voice plan details, data plan details and recent data usage.
  • Manage activation / deactivation of your Value Added Services
  • Track status of recent service requests / complaints
  • View and subscribe to Best Offers.
Terms And Conditions :
  1. You must be a Vodafone India customer to use the app (not available for business customers)
  2. To see your account information in the app you need a My Vodafone Login ID and password.
  3. If you have and existing Login ID and password (created on Vodafone India website) you can use the same. Else you can create a Login ID within the app (using Register option).
  4. Same Login ID and Password can be used on Web and the app.
  5. If you’re new to Vodafone or have recently upgraded, your certain account information will be available only after your first bill
  6. Purchase of the application is free however download charges do apply for downloading from the Android Market Place
  7. Data charges apply for the app usage and are based on your plan rates
  8. If you use the app abroad, standard international charges will apply
        ఈ అప్లికేషను గురించి మరిన్ని వివరాలకోసం మీ వోడాఫోన్ నుంచి 111 కి డయల్ చేయగలరు. 

Monday, April 15, 2013

2G మొబైల్ ఇంటర్నెట్ మరియు GPRS డేటా ప్యాక్ లకు సవరణలు చేసిన BSNL... వాలిడిటి మరియు ఉచిత డేటా తగ్గింపు.... BSNL Reduces Free Data in 2G Mobile Internet – GPRS Packs


              తాజాగా BSNL తన 2G మొబైల్ ఇంటర్నెట్ మరియు GPRS డేటా ప్యాక్ లకు సవరణలు చేసింది. ఈ మార్పులు ఏప్రిల్ 17 2013 నుంచి అమలవుతాయని కంపెని ఒక ప్రకటనలో తెలిపింది.  కొత్తగా చేసిన సవరణలు ఈ క్రింది విధముగా ఉన్నాయి.




MRPప్రస్తుతం ఇస్తున్న డేటా  మార్చిన డేటా ప్రస్తుత వాలిడిటి మార్చిన వాలిడిటి 
Rs.54500 MB500 MB30 Days25 Days
Rs.1252000 MB1.5 GB30 Days30 Days
Rs.27010 GB5 GB30 Days30 Days
Rs.3008 GB6 GB90 Days90 Days

Terms and Conditions :
  1. BSNL Telecom Circles can suitably adjust the MRP in the price band up-to Rs.5 (+ / -) of above price considering the local market condition and Technical feasibility.
  2. In case of Jammu and Kashmir MRP of Special Tariff Voucher are exclusive of Service tax.
  3. The above revised data plan tariff will be implemented and with effect from 17-04-2013.
  4. All other terms and conditions will remain the same.

అమెరికా వెళ్ళే వారి కోసం ఎయిర్ టెల్ నుంచి ప్రత్యేక అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ లు... Airtel Introduces Special International Roaming Packs...!!!

               
            ఈ మధ్యనే జాతీయ రోమింగ్ ప్యాక్ ని ప్రవేశ పెట్టిన (National Roaming Pack)ఆంధ్రప్రదేశ్ అతి పెద్ద  టెలికాం నెట్ వర్క్ ఎయిర్ టెల్, విదేశాలకు వెళ్ళే తన వినియోగదారుల కోసం ప్రత్యేక అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ లను ప్రవేశ పెట్టింది. అమెరికాలో పర్యటించే వినియోగదారులు 8500 రూపాయల రెంటల్ ఉండే ప్యాక్ లో 5 గంటల పాటు ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ ని పొందవచ్చని తెలిపింది. ఇక అవుట్ గోయింగ్ కాల్స్ విషయానికి వస్తే నిమిషానికి 20 రూపాయల చొప్పున అవుతుందని వివరించింది. ఈ ఆఫర్ 30 రోజులపాటు చెల్లుబాటు అవుతుందని, ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ అయిపోయిన తర్వాత ఇన్ కమింగ్ కాల్ కి నిమిషానికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తామని వివరించింది. అలాగే 3500 రూపాయల ప్యాక్ కు 60 నిమిషాలు, 1000 రూపాయల ప్యాక్ కు 10 నిమిషాల ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ ని పొందవచ్చని పేర్కొంది. 
               ఒక్క అమెరికాకే కాకుండా సింగపూర్, మలేషియా, థాయ్ ల్యాండ్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, ఆస్ట్రేలియా , జర్మనీ , యూ ఎ ఇ, ఇంగ్లాండ్ దేశాలకు కూడా ప్రత్యేక అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ లను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. 

Saturday, April 13, 2013

కొత్తగా 3G కనెక్షన్లు ఇవ్వవద్దు... టెలికాం కంపెనీ లకు సుప్రీం ఆదేశాలు... మన రాష్ట్రం లో వోడఫోన్ పై పడనున్న ప్రభావం...!!!

                    
                   లైసెన్సులు పొందకుండా తమ మధ్య కుదుర్చుకున్న అంతర్గత ఒప్పందం ద్వారా అక్రమంగా 3G సర్విస్ లు అందజేస్తున్న అంశంపై  టెలికాం కంపెనీలు  (ఐడియా,ఎయిర్ టెల్, వోడాఫోన్)  మరియు ట్రాయ్ మధ్య జరుగుతున్న వివాదం సుప్రీం కోర్టుకి చేరింది. దీనిపై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ 3G లైసెన్సులు లేని టెలికాం కంపెనీలు తదుపరి తీర్పు వచ్చేంత వరకూ  ఆయా  సర్కిళ్లలో కొత్తగా 3G కనెక్షన్లు ఇవ్వరాదని పేర్కొంది. అయితే ప్రస్తుతం 3G సేవలు పొందుతున్న వినియోగదారులకు తమ సేవలను అందించవచ్చని తెలిపింది. తదుపరి విచారణను మే నెలకు వాయిదా వేసింది. 
మన రాష్ట్రం పై సుప్రీం తీర్పు ప్రభావం:
                  మన రాష్ట్రం లో ఎయిర్ టెల్, ఐడియా, BSNL, ఎయిర్ సెల్ కంపెనీలు 3G లైసెన్స్ ను కలిగి ఉన్నాయి. అయితే వోడఫోన్ కి మన రాష్ట్రం లో 3G లైసెన్స్ లేకపోయినా కూడా ఐడియా తో కుదుర్చుకున్న అంతర్గత ఒప్పందం ద్వారా  తన వినియోగ దారులకు 3G సేవలను అందిస్తుంది. దీంతో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం మన రాష్ట్రం లో వోడాఫోన్ కంపెనీ మీద పడనుంది. కనుక ఆ కంపెనీ కొత్తగా 3G కనెక్షన్లను గానీ, డేటా కార్డులు కానీ అమ్మకూడదు.

Friday, April 12, 2013

ఎయిర్ టెల్ వినియోగదారులకు శుభవార్త. మీ కోసం సరికొత్త రోమింగ్ ప్యాక్... రోమింగ్ లో కేవలం 30 పైసలకే ఇన్ కమింగ్ కాల్...!!! Airtel Introduces New National Roaming Pack for Pre Paid Subscribers In Andhra Pradesh...!!!

         


            
               ఎయిర్ టెల్ ఆంధ్ర ప్రదేశ్  వినియోగదారుల కోసం ఆ సంస్థ సరికొత్త రోమింగ్ ప్యాక్ ని ప్రవేశ పెట్టింది. ఈ ప్యాక్ తో మన రాష్ట్రం నుంచి దేశం లోని ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి లబ్ధి చేకూరనుంది. అక్టోబర్ నుంచి దేశ  వ్యాప్తంగా రోమింగ్ ని ఉచితం చేయాలని టెలికాం మంత్రి కపిల్ సిబాల్ ప్రకటించిన నేపధ్యంలో ఎయిర్ టెల్ నుంచి ఈ కొత్త రోమింగ్ ప్యాక్ రావడం గమనార్హం. 

ఇక రోమింగ్ ప్యాక్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • Name Of the Pack           : National Roaming Voice Plan
  • Cost of the Pack              : 39 Rupees
  • Validity of the Pack        : 6 months (180 Days)
  • Incoming Call Charges  : 30 Paisa Per Minute for 1st month, There after 1.5 Paisa Per Second for   remaining 5 months. 
  • Out Going Call Charges: 1.5 Paisa Per Second for all Local and STD calls for Six months
 మరిన్ని వివరముల కోసం మీ ఎయిర్ టెల్ మొబైల్ నుండి "NATROAM" అని టైపు చేసి 121(టోల్ ఫ్రీ) నంబరుకు SMS పంపగలరు. 

గమనిక : దయచేసి రీఛార్జి  చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .





ఆదాయాన్ని కోల్పోతున్న ఎయిర్ టెల్... అయినా అగ్రస్థానం ....ఆంధ్రప్రదేశ్ లో మొబైల్ కంపెనీల ఆదాయ వివరాలు...!!!

             


            గత అక్టోబర్- డిసెంబర్ 2012   త్రైమాసికానికి ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ మొబైల్ కంపెనీల ఆదాయ వివరాలు ఈ విధముగా ఉన్నాయి.
               
మొత్తం ఆదాయం:

IDEA Cellular

     430.58     +3.11%
Vodafone Essar
185.52+6.52%
Bharti Airtel Ltd

865.51-6.86%
Aicel Limited

34.77-8.64%
Uninor

51.58+1.31%

గమనిక :  అంకెలు కోట్లలో  మరియు పక్కన ఉన్న శాతాలు క్రితం త్రైమాసికంతో పోలిస్తే పెరుగుదల లేదా తరుగుదలని సూచిస్తాయి. 


ఒక్కొక్కరి మీద వచ్చే ఆదాయం:

IDEA Cellular                                                                     134.38    +2.70%
Vodafone Essar                                                                   99.11     +8.16%
Bharti Airtel Ltd                                                                  158.52    -3.15%
Aicel Limited                                                                       60.26      -9.84%
Uninor                                                                                 42.84     +1.65%
                       

గమనిక: అంకెలు రూపాయల్లో మరియు పక్కన ఉన్న శాతాలు క్రితం త్రైమాసికంతో పోలిస్తే పెరుగుదల లేదా తరుగుదలని సూచిస్తాయి. 




Thursday, April 11, 2013

AP Telecom News అభిమానులకు, బ్లాగర్లకు ఉగాది శుభాకాంక్షలు...!!!


        AP Telecom News అభిమానులకు, బ్లాగర్లకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...!!! 

       ఈ విజయనామ సంవత్సరంలో మీ అందరికి విజయం కలగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ.... 

మీ 

AP Telecom News 

Note: Subscribe for email alerts to get latest developments in AP telecom circle via email.

Tuesday, April 9, 2013

ఒక సంవత్సర కాల పరిమితితో మూడు కొత్త 3G డేటా ప్యాక్ లను ప్రవేశ పెట్టిన BSNL..... BSNL New 3G Data Packs With One Year Validity.

           వారం క్రితం యువత కోసం ప్రత్యేక డేటా ప్యాక్ లను ప్రవేశ పెట్టిన BSNL తాజాగా మరో మూడు కొత్త 3g ప్యాక్ లను ప్రవేశ పెట్టింది. ఈ ప్యాక్ లు ఏప్రిల్ 15 వ తేది నుంచి అందుబాటులో ఉంటాయి. డేటా ప్లాన్ల వివరాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి. 


DPV-3299 DPV-2299 DPV-1251
MRP of 3G Data Plan Voucher Rs.3299 Rs.2299 Rs.1251
FREE 3G Data Usage 2.5 GB per month for 12 months 1.5 GB per month for 12 months 0.75 GB per month for 12 Months
Main Account Validity One year from the date of recharge/activations. Further extension of validity, through same plan voucher.
Availability Through C- Top-up only
Applicability For any 2G & 3G data plans with and without sale of BSNL 3G Data Card or any of the BSNL bundled Data Card
Base Voice Tariff plan Prepaid  “Per minute Plan”
Terms & Conditions :
  1. BSNL Telecom Circles can suitably adjust the MRP in the price band upto Rs.5 (+ / -) of above price considering the local market condition and technical feasibility.
  2. In case of Jammu and Kashmir circle, MRP of Special Tariff Voucher are exclusive of Service tax.
  3. The above plans will be implemented and with effect from 15-04-2013.
  4. All other terms and conditions will remain the same.

గమనిక : దయచేసి రీఛార్జి  చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .

యూనినార్ వినియోగదారుల కోసం ఉగాది ప్రత్యేక వోచర్... Special Recharge Voucher from Uninor for Ugadi 2013




            ఉగాది పండగని పురస్కరించుకుని టెలికం రంగ కంపెని యునినార్  తన  వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జి వోచర్ ని విడుదల చేసింది . రూ 210 విలువగల వోచర్ తో రీచార్జ్ చేస్తే 245 రూపాయల టాక్  టైం జీవిత కాలపు కాల పరిమితితో లభిస్తుందని ఆ కంపెని విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వోచర్ అన్ని రిటైల్ ఔట్లెట్లలో లభిస్తుందని ఆ కంపెని తెలిపింది.  

గమనిక : దయచేసి రీఛార్జి  చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .

Monday, April 8, 2013

ప్రీ పెయిడ్ బేస్ టారిఫ్ రేట్లను భారీగా పెంచిన టాటా డో కో మో... సెకనుకి 2 పైసల దాకా వడ్డన....!!! Tata Docomo increases prepaid base tariff up to 2 paisa per second...!!!

                 

                    టెలికాం  రంగంలో  ప్రతి సెకనుకి ఒక పైసా నినాదంతో అదిరిపోయే ఆరంగేట్రం చేసిన టాటా డో కో మో తన పంధా మార్చుకుంది. ఈ మధ్యనే డేటా, మెసేజ్ మరియు వాయిస్ ప్యాక్ ల ధరలు పెంచిన డొ కో మో తాజాగా తన బేస్ టారిఫ్ రేట్లను దాదాపు 100% మేర పెంచి ఇతర ఆపరేటర్లతో జత కలిసింది. పెంచిన రేట్ల  ప్రకారం తన బేస్ టారిఫ్ ధరను ప్రతి సెకనుకి 2 పైసల చొప్పున నిర్ణయించింది ( బేస్ టారిఫ్ అంటే ఎటువంటి స్పెషల్ టారిఫ్ ప్యాక్ లు లేకుండా కంపెనీ ఛార్జ్ చేసే ధర.) ఈ టారిఫ్ అన్ని లోకల్ మరియు  ఎస్ టి డి మొబైల్స్ కి వర్తిస్తుంది. ఈ బేస్ టారిఫ్ ప్యాక్ లు  కేవలం కొత్తగా కనెక్షన్లు తీసుకునే వారికి ఒక సంవత్సర వాలిడిటితో వర్తిస్తాయని, పెంచిన టారిఫ్ లు తన CDMA  మరియు GSM కస్టమర్లకు ఇద్దరికీ వర్తిస్తాయని,పాత కస్టమర్లకు వారి వారి బేస్ టారిఫ్ చొప్పునే ఛార్జ్ చేయ బడుతుందని ఆ కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటన లో తెలిపింది. 

Tuesday, April 2, 2013

రిలయన్స్ 94 రూపాయల డేటా ప్యాక్ కి సవరణలు, ఉచిత sms ల ఉపసంహరణ...Reliance modifies 94 rupees Data Pack, Withdraws sms benifits...

               
             రిలయన్స్ తాజాగా తన CDMA విభాగంలో అత్యంత ఆదరణ పొందిన 94 రూపాయల డేటా ప్యాక్ కి సవరణలు చేసింది . ఇప్పటివరకు ఈ డేటా ప్యాక్ కింద ప్రతి నెలా 1 GB హై స్పీడ్ డేటాని ఆరు నెలలతో పాటు ప్రతి రోజూ 100 మెసేజ్ లను ఆరు నెలల పాటు  ఉచితంగా పంపుకునే వెసులుబాటు ఉండేది. అయితే టెలికాం రంగంలోని ఇతర ఆపరేటర్లు ఇన్ కమింగ్ మెసేజ్ లకు టెర్మినేషన్ ఛార్జ్ లు వసూలు చేయడం మొదలు పెట్టడంతో రిలయన్స్ తన డేటా ప్యాక్ లోని ఉచిత sms లను ఉపసంహరించుకుంది. అదే విధంగా వాలిడిటిని కూడా ఒక నెలకు తగ్గించింది. 

               ఈ మార్పులు ఇంకా ఆ సంస్థ వెబ్ సైట్లో అప్ డేట్ చేయలేదు. అయితే అదే సంస్థకు చెందిన  ఆన్లైన్ రీఛార్జి పోర్టల్లో ఈ మార్పులను గమనించవచ్చు. 


కొత్త డేటా ప్యాక్ ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1. Rs 5 offers 60 MB for 1 day

2. Rs 18 offers 200 MB for 3 days


3. Rs 44 offers 500 MB for 10 days


4. Rs 94 offers 1.5 GB  for 30 days


గమనిక : దయచేసి రీఛార్జి  చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .

Monday, April 1, 2013

యువత కోసం BSNL కొత్త 3G ప్లాన్లు....BSNL New Data Plans For Youth...




         యువత అవసరాలను దృష్టి లో ఉంచుకుని BSNL కొత్తగా రెండు 3G ప్యాక్ లను తిరిగి ప్రవేశ పెట్టినది. ఈ ప్యాక్ లు 25 మార్చ్ 2013 నుంచి అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపినది. కొత్తగా ప్రవేశ పెట్టిన డేటా పాక్స్ వివరాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి

STV 120

Data STV in Rs. (Inclusive of S.Tax)        120 Rupees
Day/Any time usage in MB.                      250 MB
Night Usage in MB                                     1250 MB
Total bundled free usage in MB               1500 MB
Validity in (days)                                       30 Days

STV 599


Data STV in Rs. (Inclusive of S.Tax)           599 Rupees
Day/Any time usage in MB.                          3000 MB
Night Usagein MB                                        4000 MB
Total bundled free usage in MB                  7000 MB
Validity in (days)                                           30 dAYS

గమనిక : దయచేసి రీఛార్జి  చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .



ఆంధ్రప్రదేశ్ తాజా మొబైల్ చందాదారుల సంఖ్య... Latest Mobile Subscriber Base Of Andhra Pradesh Circle...Feb 2013

ఆంధ్రప్రదేశ్  తాజా మొబైల్ వినియోగదారుల సంఖ్య ఈ విధంగా ఉంది





1 Airtel                        1,80,73,838

2 Idea                           1,10,28,106

3 BSNL                          90,92,617

4 Reliance                     68,91,681

5 Tata Docomo             67,77,779

6 Vodafone                    57,78,818

7 Uninor                        41,89,040

8 Aircel                          17,37,528

9 MTS                              6,07,894



Source: Feb-13 data released by AUSPI and COAI

NOTE: Reliance and Tata Docomo numbers indicate both CDMA  and GSM subscribers.