ఈ మధ్య కాలంలో టీవీలలో ఐడియా వారు ఇస్తున్న ప్రకటనలను మీరు గమనించే ఉంటారు . ఐడియా ఇంటర్నెట్ తో నువ్ చెవిలో పువ్వెట్టు అని ఒక పాట వస్తుంది. ఆ ప్రకటనలో ఎవరి చెవిలో ఎవరు పూలు పెట్టారో తెలియదు గానీ , ఐడియా వారు మాత్రం తన వినియోగదారుల చెవుల్లో తప్పుడు ప్రకటనలతో బాగానే పూలు పెడుతుంది.
ఇక విషయానికి వస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల వలన మొబైల్లో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది . సరిగ్గా ఇక్కడే టెలికాం కంపెనీలు ఆదాయం పెంచుకోవడానికి రకరకాల అడ్డదారులు తొక్కుతున్నాయి. ఈ మధ్య కాలంలో అపరిమిత ఇంటర్నెట్ అనే పేరుతో కొన్ని టెలికాం కంపెనీలు చేస్తున్న మోసం శ్రుతి మించుతోంది. అది ఎంతగా అంటే మన భారతీయులను , మరియు మన భారత దేశ సాంకేతికతను అవమానించే అంత. పైన హెడ్డింగ్ మాత్రం 197 రూపాయలకే అపరిమిత ఇంటర్నెట్ అని పెడతారు. కింద చిన్న అక్షరాలతో మాత్రం కేవలం 2 GB వరకు మాత్రం అని అంటారు. 2GB దాటిన తరువాత స్పీడ్ 10kbps అంటారు. అసలు ఈ 10kbps స్పీడ్ తో కనీసం గూగుల్ పేజి కుడా ఓపెన్ అవదు . అలాంటిది ఇక అపరిమితంగా ఇంటర్నెట్ ఎలా వాడుకోవాలో ఆ మహానుభావులకే తెలియాలి. అపరిమితం అనకుండా కేవలం 2GB డేటా ఇచ్చి సరిపెట్టినా గౌరవ ప్రదం గా ఉంటుంది. కాని ఇలా 10kbps స్పీడ్ తో అపరిమితం గా ఇంటర్నెట్ అని ప్రజలని మోసం చేయడం భావ్యం కాదు.
మీరు కూడా మీ అభిప్రాయాలను ఇక్కడ పంచుకోండి . మీ అభిప్రాయాలు గౌరవించబడతాయి

Unlimited Data Packs
MRP | Data Benefit | Data Validity (Days) | Overage | FUP limit | Self activation |
197 | 2GB Unlimited (250 MB 3G data + 1798 MB 2G data) | 28 | - | Speed from 2 GB to 3 GB upto 40kbps & After 3 GB speed @10 Kbps | - |
248 | 3GB Unlimited | 28 | - | Speed from 3GB drops to 10 Kbps | - |