Monday, September 22, 2014

భారీగా 2G డేటా రేట్లు పెంచిన టెలికాం కంపెనీలు... ఇప్పుడు 1GB డేటా విలువ 175 పైనే....!!!!!

                   
 
                      స్మార్ట్ ఫోన్ లలో డేటా వాడకం పెరగడంతో టెలికాం ఆపరేటర్లు తద్వారా లభించే ఆదాయ మార్గాల పైన దృష్టి పెట్టాయి. వినియోగదారులనుంచి ముక్కుపిండి మరీ అధికంగా వసూలు  చేయడం మొదలుపెట్టాయి. గతం లో 1GB డేటా విలువ 155 రూపాయలు ఉండగా ఇప్పుడు దాని విలువ 175 రూపాయలకు పైగా పెరిగింది. ఇప్పుడు 155 రూపాయలకు కేవలం 525 MB డేటాను మాత్రమే అందిస్తున్నాయి . ప్రస్తుతం మన రాష్ట్రం లో వివిధ కంపెనీలు ఆఫర్ చేస్తున్న 1GB డేటా పాక్స్ వివరాలు ఈ క్రింది విధం గా ఉన్నాయి


S.NO
Operator
Price (Rs)
validity
benifits
1
Airtel
     175
  28 days
1GB 2G Data
2
Idea
     175
  28 days
1GB 2G Data
3
Vodafone
     174
  28 days
1GB 2G Data
4
BSNL
     155
  30 days
1GB 2G/3G Data
5
Uninor
     89
  28 days
1.5GB 2G Data
6
Tata DOCOMO
     95
  30 days
1GB 2G Data
7
Reliance
     175
  30 days
2GB 2G Data

Tuesday, June 24, 2014

వినియోగ దారుల చెవుల్లో పూలు పెడుతున్న ఐడియా.....!!!!

                         ఈ మధ్య కాలంలో టీవీలలో ఐడియా వారు ఇస్తున్న ప్రకటనలను మీరు గమనించే ఉంటారు . ఐడియా ఇంటర్నెట్  తో నువ్ చెవిలో పువ్వెట్టు అని ఒక పాట  వస్తుంది. ఆ ప్రకటనలో ఎవరి చెవిలో ఎవరు పూలు పెట్టారో తెలియదు గానీ , ఐడియా వారు మాత్రం తన  వినియోగదారుల చెవుల్లో తప్పుడు ప్రకటనలతో  బాగానే పూలు పెడుతుంది.

                   ఇక విషయానికి వస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల వలన మొబైల్లో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది . సరిగ్గా ఇక్కడే టెలికాం కంపెనీలు ఆదాయం పెంచుకోవడానికి రకరకాల అడ్డదారులు తొక్కుతున్నాయి. ఈ మధ్య కాలంలో అపరిమిత ఇంటర్నెట్ అనే పేరుతో కొన్ని టెలికాం కంపెనీలు చేస్తున్న మోసం శ్రుతి మించుతోంది. అది ఎంతగా అంటే మన భారతీయులను , మరియు మన భారత దేశ సాంకేతికతను అవమానించే అంత. పైన హెడ్డింగ్ మాత్రం 197 రూపాయలకే అపరిమిత ఇంటర్నెట్ అని పెడతారు. కింద చిన్న అక్షరాలతో మాత్రం కేవలం 2 GB వరకు మాత్రం అని అంటారు. 2GB దాటిన తరువాత స్పీడ్ 10kbps అంటారు. అసలు ఈ 10kbps స్పీడ్ తో కనీసం గూగుల్ పేజి కుడా ఓపెన్ అవదు . అలాంటిది ఇక అపరిమితంగా ఇంటర్నెట్ ఎలా వాడుకోవాలో ఆ మహానుభావులకే తెలియాలి. అపరిమితం అనకుండా కేవలం 2GB  డేటా ఇచ్చి సరిపెట్టినా గౌరవ ప్రదం గా ఉంటుంది. కాని ఇలా 10kbps స్పీడ్ తో అపరిమితం గా ఇంటర్నెట్ అని ప్రజలని మోసం చేయడం భావ్యం కాదు. 

Unlimited Data Packs

MRPData BenefitData Validity (Days)OverageFUP limitSelf activation
1972GB Unlimited (250 MB 3G data + 1798 MB 2G data)28-Speed from 2 GB to 3 GB upto 40kbps & After 3 GB speed @10 Kbps-
2483GB Unlimited28-Speed from 3GB drops to 10 Kbps-


మీరు కూడా మీ అభిప్రాయాలను ఇక్కడ పంచుకోండి . మీ అభిప్రాయాలు గౌరవించబడతాయి